Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేవైఎం అధ్యక్షులు భాను ప్రకాష్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో సూత్రధారులైన అధికారులందరిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని బీజేవైఎం అధ్యక్షులు భాను ప్రకాష్ అధ్వర్యంలో నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయం ధర్నా చేశారు. భాను ప్రకాశ్ సహా బీజెవైఎం నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి అనంతరం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. భానుప్రకాష్ మాట్లాడుతూ..ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగుల, యువకుల, విద్యార్థుల జీవితాలకు ముడిపడి ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షాపత్రాలు లీక్ కావడాన్ని బీజేవైఎం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. సకాలంలో ఉద్యోగ ఖాళీలను గుర్తించి ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వడంలో ఘోరంగా విఫలమైన టీఎస్పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లో తప్పుడు ప్రశ్నలు, నియమాలు, నిబంధనలను తప్పులు తడకగా మార్చి, గ్రామీణ పేద విద్యార్థులు, అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తూ, చివరికి కనీసం ప్రశ్న పత్రాలను రక్షించడంలో తమ చేతగాని తనాన్ని, అలసత్వాన్ని బహిర్గతం చేశారని ఆరోపించారు. ఘటనకు నైతిక బాధ్యత వహించి చైర్మన్ జనార్దన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ప్రశ్నపత్రల లీక్‌లో నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధన కార్యదర్శి అరుణ్ కుమార్, బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్, బీజేవైఎం కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు నవీన్ రెడ్డి, బీజేవైఎం మాధపూర్ డివిజన్ అధ్యక్షులు ఆనంద్ కుమార్, బీజేవైఎం మాధపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి శివాయాదవ్, బీజేవైఎం మియాపూర్ డివిజన్ ఉపాధ్యక్షులు వెంకట్, బీజేవైఎం కొండాపూర్ డివిజన్ ఉపాధ్యక్షులు కార్తిక్, బీజేవైఎం నాయకులు లోకేష్, నాని, రాముసింగ్, బలరాం.