Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-పరిగి
రోడ్డు ప్రమాదంలో ఒకరు మతిచెందగా ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన పరిగి మండలం రంగంపల్లి సమీపం లో బుధవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం మండలం పరిధిలోని రంగంపల్లి గ్రామ సమీపం లోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై లారీ, తవేరా వాహనం ఢకొన్నాయి. ప్రమాదంలో చేవెళ్ల మండ లం నాగర్గూడకు చెందిన తవేరా డ్రైవర్ అనీఫ్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. యాలాల మండలం పగి డాలకు చెందిన యాదయ్య, లాలప్పలకు తీవ్ర గాయాలు కావడంతో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడినుండి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. తవేరా డ్రైవర్ అనీఫ్ వాహనం లోనే ఇరుక్కుపోవడంతో జేసీబీ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.