Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
మున్సిపల్ కమిషనర్ శరత్ చం ద్ర అధ్యక్షతన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషి ఎన్సీ ఆఫ్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటె డ్ ఆధ్వర్యంలో పట్టణ స్థానిక సంస్థల అధికారులకు ఇంధ న సామర్థ్యంపై సామర్థ్య నిర్మాణ కార్యక్రమం ఉదయం 11:00 గంటలకు కౌన్సిల్ మీటింగ్ హల్లో బుధవారం నిర్వహించారు. ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ మాస్టర్ ట్రైనర్ మౌజా అలీ మాట్లాడుతూ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ భవనాల ఈటింగ్ వెంటనే ఎయిర్ కండిషన్ హాట్ వాటర్ ఈటింగ్ వంటి యాంత్రిక వ్యవస్థలు పరికరాలు ఇంటీరియర్, ఎక్స్టీరియర్ లైటింగ్ విద్యుత్ శక్తి, మోటార్లు పునరుద్ధ పాదకశక్తి వ్యవస్థలు ఎనర్జీ కన్వర్జేషన్ బిల్డింగ్ కోడ్‌లోకి వస్తాయన్నారు. ఈసీబీసీ ఉద్దేశం రాబోయే సంవత్సరాల్లో ఇంధన సామర్థ్య ప్రమాణాలకు అనుగుణం గా భవన నిర్మాణ పరిశ్రమను సిద్ధం చేయడానికి మార్కె ట్‌కు అనుగుణంగా తగిన సమ యాన్ని అందించడానికి భవనాలకు సమ ర్థవంతమైన డిజైన్ నిర్మాణానికి కనీస అవసరా లను అందించడం రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన కార్యకలాపాలు బయోమాస్, సోలార్ విండ్ మినీ ఐడల్ వేస్ట్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు పునరుత్పాదక శక్తికిందన పరిరక్షణ కార్యకలాపాలను పోషించడానికి ప్రణాళిక విధానతయారీ వంటివి ఎనర్జీ కన్జర్వేషన్‌ను ప్రోత్స హించడానికి అవగాహన వర్క్‌షాపులు నిర్వహిస్తున్నామన్నారు. మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్రమాట్లాడుతూ ప్రాజెక్టులు అత్యాధునిక సాంకేతికలతో పాటుగా నిపుణులు, సాంకేతిక నిపుణులతో కలిసి పవన శక్తి బయో మాస్ ఎనర్జీ పారిశ్రామిక వ్యర్థాల నుండి శక్తి మినీ హైడల్ ప్రాజెక్ట్ బయోఎనర్జీ భూ ఉష్ణశక్తి జీవ ఇంధనాలు, ఇతర పునరుత్పాదక శక్తి సమర్థవంతంగా విని యోగిస్తూ పట్టణ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తామ న్నారు. కార్యక్రమంలో టీఎస్ఆర్ఈడీసీఓ మాణిక్యం, డిఈఈ తబిత, పట్టణ ప్రణాళికా అధికారి శ్రీధర్, వివిధ పురపాలక సంఘ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.