Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
పరిగి పట్టణ కేంద్రంలో ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఒక నిమిషం లేటైనా లోపటికి అను మతిలేదని నిబంధన ఉండడంతో విద్యార్థులు చాలావ రకు 8 గంటలకల్లా పరిక్షాకేంద్రాలకు చేరుకున్నారు. 8:30 నిమిషాలకు విద్యార్థులను అధికారులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. దూర ప్రాంతంలోని విద్యార్థులు పరీక్షా కేంద్రానికి రావడానికి కొంత లేట్ అయినప్పటికీ ఉరుకుల పరుగులతో 9 గంటలలోపే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లిపో యారు. ఎలాంటి మాస్ కాపింగ్‌కు తావివ్వకుండా ముం దుగానే విద్యార్థులను చెక్‌చేసి పరీక్షాకేంద్రాల్లోకి అనుమతించారు. పట్టణ కేంద్రంలో గ్లోబల్ జూనియర్ కళాశాల, విజ్ఞాన్ జూనియర్ కళాశాల, పల్లవి జూనియర్ కళాశాల, గవర్నమెంట్ జూనియర్ కళాశాల, మోడల్ స్కూ ల్ జూనియర్ కళాశాలలో అధికారులు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 1,270 మంది విద్యార్థులకుగాను 1,224 మంది విద్యార్థులు పరీ క్షకు హాజరుకాగా, 46 మంది విద్యార్థులు గైర్హాజరయ్యా రు. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 323 మంది విద్యా ర్థులకుగాను 313 విద్యార్థులు హాజరయ్యారు. 10 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సం ఘటన జరగకుండా పరీక్షా కేంద్రాలవద్ద పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేశారు. మొదటిరోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.