Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గ్రామా ల్లో చేపట్టిన సీసీరోడ్ల పనులన్నిం టినీ మార్చి మాసాంతం వరకు పూర్తి చేయాల ని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత ఇంజ నీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నుండి పంచాయతీ రా జ్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సీసీరోడ్ల నిర్మాణ పనులపై పంచాయతీరాజ్ ఏఈలు, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గ్రామాల్లో మంజూరైన సీసీ రో డ్ల పనులను వేగవంతం చేసి మార్చి మాసాంతం వరకు పూర్తి చేయాల న్నారు. ఇప్పటి వరకు మంజూరైన ప్పటికీ ప్రారంభం కాని పనులనూ వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. చేపట్టిన పనులకు సంబం ధించి చెల్లింపులకు ఈ మాసం 20 లోపు వెంటనే ఎఫ్టీ ఓలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు.