Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి నితిన్ గట్కరీని కలిసిన ఎంపీ రంజిత్ రెడ్డి
నవతెలంగాణ-శంషాబాద్
నేషనల్ హైవే పై సెకండ్ పేజ్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రమంత్రి నితీష్ గడ్కరి గ్రీన్ సిగల్ ఇచ్చారని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఈ మేర కు ఆయన బుధవారం కేంద్రమంత్రి గడ్కరిని కలిసి ధన్య వాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ శంషాబాద్ నేషనల్ హైవే-44పై ప్రస్తుతం నిర్మిస్తున్న ఫ్లైఓవర్ కారణంగా రవాణా ఇబ్బందులు ఏర్పడతాయని ప్రజలు ప్రజాప్రతినిధులు అనేక అభ్యంతరాలు వ్యక్తం చే స్తూ ధర్నాలు నిరసనలు వ్యక్తం చేశారన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నేషనల్ హైవే విస్తరణ కోసం స్థాని క ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ సహకారంతో సెకండ్పేజ్ ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలి పారు. ఇందులో భాగంగానే కేంద్ర జాతీయ రహదారుల రవాణాశాఖ మంత్రితో పాటు అందుకు సంబంధించిన అ ధికారులను కలిసి వినతి పత్రాలు అందజేసి సమస్యను వా రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. దీనికి కేంద్ర మంత్రి, ప్రజల రవాణా సౌకర్యం దృష్ట్యా సిద్ధాంతి గ్రా మం నుంచి మల్లికా కన్వెన్షన్ వరకు అదనపు వంతెన నిర్మా ణం చేపడతామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. ప్రజల రవాణా సౌకర్యం కోసం తనవంతు ప్రయత్నం చేశానని ఆ ప్రయత్నం త్వరలోనే సఫలీకృతమైనందున సంతోషం వ్య క్తం చేశారు. స్థానిక ప్రజలు కౌన్సిలర్ మేకల వెంకటేష్, పలువురు ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ చొరవతో ఎంపీ రంజిత్ రె డ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకా రం కేంద్ర మంత్రులతో, కేంద్ర అధికారులతో మాట్లాడి సహకారంతో మరో ఫ్లైఓవర్ నిర్మాణం అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.