Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ప్రభుత్వ సంకల్పం మేరకు ధరణి ద్వారా భూ సమస్యలు పరిష్కారం కావాలి తప్ప, కొత్త సమస్యలు సృష్టించొద్దని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. బుధవారం టెలికాన్ఫెరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లతో చేపడుతున్న ధరణి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు నెల రోజుల నుంచి రెవెన్యూ సిబ్బంది అందరూ కష్టపడి పనిచేసి ఎక్కువ మొత్తంలో ధరణి సమస్యలు పరిష్కరించడం జరిగింద న్నారు.అర్హులైన రైతులను గుర్తించి, వారికి సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు పని చేయాలని సూచించారు. పేరు నమోదు చేసినప్పుడు తప్పులు లేకుండా పని చేసి, రైతులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్లియర్ టైటిల్, పొజిషన్లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ప్రభుత్వ సంకల్పం మేరకు ధరణి ద్వారా భూ సమస్యల పరిష్కారం కావాలి తప్ప, కొత్త సమస్యలు సష్టించొద్దని తెలిపారు.ఒక రెవెన్యూ అధికారికి చెడ్డ పేరు రాకుండా అందరూ కలిసి పనిలో భాగమై, నమోదు ప్రక్రియలో స్పష్టంగా పనులు చేయాలని చెప్పారు. ఒక పట్టాదారుకు సంబంధించిన ఒక గుంట భూమి కూడా అన్యాయంగా ఇంకొకరికి మార్చకూడదని ఆదేశించారు. ప్రభుత్వానికి సంబంధించిన అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు ఎక్కడైనా పొరపాటున పట్టా భూములుగా పడినట్లయితే వాటిని గుర్తించి సరిచేయాలని తెలిపారు. కోర్టు కేసుల విషయంలో పూర్తి జాగ్రత్తలు వహించి పరిశీలించిన తరువాతనే ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ భూము లను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ కలెక్టర్ తెలిపారు. ధరణి సమస్యల పరిష్కారానికి సంబంధించిన నివేదికలు, రికార్డులను కలెక్టర్కు పంపేటప్పుడు స్పష్టంగా తప్పులు లేకుండా జాగ్రత్తగా అందించాలని ఆదేశించారు. జిఎల్ఎమ్, సక్సెషన్ పనులకు తప్పనిసరిగా 2010 సంవత్సరపు పహానిలను జతపరచాలని సూచించారు. వచ్చే రెండు నెలలు కష్టపడి పని చేసినట్లయితే దాదాపు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ తెలిపారు.