Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిమిషం నిబంధనతో విద్యార్థుల పరుగులు
- మొదటి రోజు పరీక్షకు 72,373 మంది హాజరు
- 2308 మంది గైర్హాజరు
- పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ హరీశ్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమై య్యాయి. నిమిషం నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులకు ఉరుకులు... పరుగులు తప్ప లేదు. ఉదయం 8గంటలకే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు క్యూలో నిలబడ్డారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు అధికారులు 182 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 74,681 మంది విద్యార్థులకు గాను తొలి రోజు పరీక్షకు 2308 మంది గైర్హాజర య్యారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ఎల్.బి.నగర్ లోని శివాని జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరీష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు గురించి కలెక్టర్ ఆరా తీశారు. సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్లను కలెక్టర్ ఆదేశించారు.పరీక్షా కేంద్రాల్లో తగిన సౌకర్యాలు అందుబాటులో ఉండాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్ విద్యాధికారి వెంక్యా నాయక్ ఉన్నారు.