Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి
నవతెలంగాణ-చేవెళ్ల
విద్యార్థులు ఇష్టంగా చదివి, లక్ష్యంతో ఉన్నత స్థాయికి ఎదగాలని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి భార్య సీత, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు చేవెళ్ళ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి సహకారంతో విద్యార్థులకు పరీక్షా ఫ్యాడ్స్ అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు ప్రతి విద్యార్థి క్రమశిక్షణ అలవర్చుకుని చదువుకోవాలన్నారు. గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని నేటి యువత కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సమయం ఎంతో విలువైనదని అనవసర విషయాల కోసం విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. తల్లీదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తున్నారనీ, వారు కలలుగన్నట్టుగా బాగా చదివి ఉన్నత స్థానంలో నిలవాలని కోరారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి తో కలిసి చిరు సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షులు బక్కరెడ్డి రవీందర్ రెడ్డి అన్నారు. రంజిత్‌రెడ్డి విద్యార్థులకు పెన్నులను అందజేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు మాలతి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు శేరి శివారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పేదోల్ల ప్రభాకర్, బిఆర్ఎస్ వి నియోజకవర్గ మండల అధ్యక్షులు నరేందర్ గౌడ్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.