Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాద్ నగర్
షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గు మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినట్ట సర్పంచ్ పసుపుల నర్సింలు తెలిపారు. గురువారం ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కి సహకరిస్తున్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఎలుగంటి శ్రీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్, ఎదిర రామకృష్ణ, బి. యాదయ్య, యెద్దు కృష్ణయ్య, దామోదర్, రాములు, రాజేష్, శీను, నర్సింలు, శ్రీశైలం, పసుపుల ప్రశాంత్, కె. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.