Authorization
Tue April 15, 2025 01:52:41 pm
- బీజేపీ రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
నడిగడ్డతండా సమస్యలు పరిష్కరించడంలో తండావాసులకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. గురువారం తండావాసులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనీస సౌకర్యాలు, సీఆర్పీఎఫ్ సమస్య, ఇంటి భద్రత గురించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకునే విధంగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. సమస్యలపై ఐక్యంగా పోరాడినప్పుడే పరిష్కారమవుతాయని తెలిపారు. ఈ సమావేశంలో రెడ్యానాయక్, తిరుపతి, స్వామినాయక్, చందు, ఆంజనేయులు, రాజ్ జైస్వాల్, రాఘవేంద్రలతో తదితరులు పాల్గొన్నారు.