Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కూడా కాలనీ అండ్ నల్లగండ్లలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరికెపూడి గురువారం పర్యటించారు.'కాలనీలో చెరువు వద్ద కడుతున్న మురుగు నీటి పైప్ లైన్ పనులు పూర్తి చేయాలని, కొత్తగా ఏర్పడిన కాలనీలో మంజీర తాగునీటి వసతి కల్పించి, రోడ్లు, డ్రయినేజీ, వీధిదీపాలు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. దీనికి సాను కూలంగా స్పందించిన ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న అన్ని సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తామని, కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. మంజీర తాగు నీటి వసతిని త్వరలోనే కలిపిస్తామన్నారు. దశల వారిగా అన్ని పనులు పూర్తి చేసి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మంత్రి ప్రగడ సత్యనారాయణ, అవంతిక గోదావరి కాలనీ వాసులు కిరణ్ కుమార్, శ్రీ హర్ష, సాయికృష్ణ, సంతోష్, దేబాసిస్, కిరణ్, కైలాష్, రామకృష్ణ, నాగలక్ష్మి ,కీర్తి వర్మ, కళ,సత్య,సాహిత్య, దివ్య కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.