Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మహేష్ రెడ్డి
- కార్యకర్త కుటుంబానికి రూ.2లక్షల చెక్కు పంపిణీ
నవతెలంగాణ-కుల్కచర్ల
కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. కుల్కచర్ల మండలం కామునిపల్లి గ్రామంలో గత కోద్ది రోజులు క్రితం బీఆర్ఎస్ కార్యకర్త ఎర్రం రాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురు వారం బీఆర్ఎస్ బీమా రూ.2 లక్షల చెక్కును రాజు కుటు ంబ సభ్యులకు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మహిపాల్ రెడ్డి, ఎంపీపీ సత్యమ్మ హరిశ్చందర్, జడ్పీటీసీ రాందాస్ నాయక్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సేరిరాంరెడ్డి ప్రధాన కార్యదర్శి గజ్జి లక్ష్మయ్య ఎంపీటీసీ చందన బాల్ రెడ్డి, ఎంపీటీసీలు , సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.