Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులు లక్ష్యంతో ఉన్నత స్థాయికి ఎదగాలి
- ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనుకున్నది సాధిస్తాం
- డీఎస్పీ శేఖర్‌గౌడ్
- ఆర్థిక, మానసిక, విద్య, ఆరోగ్యంపై అవగాహనా కార్యక్రమం
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
మనిషికి శత్రువు బద్ధకమనీ, ఈ బద్దకం వీడినప్పుడే అనుకున్న లక్ష్యం సాధిస్తామని తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ అన్నారు. బుధవారం పెద్దేముల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో స్థానిక ఎస్సై అన్వేష్ రెడ్డి నేతృత్వంలో ఆర్థిక, మానసిక, విద్య, ఆరోగ్యం పట్ల తాండూర్ డీఎస్పీ శేఖర్‌గౌడ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శేఖర్‌గౌడ్ మాట్లా డుతూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాదిస్తామన్నారు.సమాజంలో చదువుతోపాటు డబ్బు వృథా చేయకుండా పొదుపు చేయడం నేర్చుకోవాలని సూచిం చారు. ప్రతి వ్యక్తి ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని వివరించారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో చదువుకుంటే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని సూచించారు. తల్లిదండ్రులను శరీరకంగా, దృఢంగా ఉండే విధంగా చూసుకునే బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. 18 ఏండ్లలోపు ఉన్న ఆడపిల్లలను పెండ్లి చేసినా, ప్రోత్స హించిన వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతప్ప, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లమ్మ, ఏఎస్ఐ నారాయణ, హెడ్ కానిస్టేబుల్ మల్లేశం, షీ టీం కానిస్టేబుల్ మమత, పాఠశాల ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.