Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి అన్నారు. గురువారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డిలో ఉన్న కార్పొరేటర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూత్ సశక్తి కరణ్ అభియాన్ వర్క్ షాప్ కార్యక్రమంలో ముఖ్య అతిగా హాజరై, మాట్లాడుతూ పార్టీని బలోపేతంలో భాగంగా వన్ డే వన్ భూత్ కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. మరో 31 మందితో బూత్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. గత పార్లమెంట్ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్ చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతునాయక్, రంగారెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్,రంగారెడ్డి జిల్లా కోశాధికారి రమేష్ సోమిశెట్టి,రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు విట్టల్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.