Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులు పడుతున్న కంటి వెలుగు సిబ్బంది
నవతెలంగాణ-షాబాద్
మాచనపల్లి గ్రామపంచాయతీ భవనంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని గ్రామ యువజన సంఘం సభ్యులు అన్నారు. గురువారం గ్రామ యువజన సంఘం సభ్యులు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. గత వారం రోజు లుగా మాచన్‌పల్లి గ్రామపంచాయతీ భవనంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతోంది. గ్రామపంచాయతీ భవనంలో మూత్రశాలలు మరుగుదొడ్లు, లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కంటి వెలుగు సిబ్బందిలో చాలావరకు మహిళలు ఉండడంతో వారికి వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పంచాయతీ కార్యాలయంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని గ్రామ యువజన సంఘం సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు కుమార్, గిరీష్, రాజశేఖర్, శివ, నరేందర్, రమేష్, సుమన్, నరేష్, సురేష్, మలేష్, సురేందర్, వెంకటకృష్ణ, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.