Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐసీసీ సభ్యులు ఎం. రమేష్ మహరాజ్
నవతెలంగాణ-తాండూరు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఏఐసీసీ సభ్యులు రమేష్ మహారాజ్ అన్నారు. గురువారం తాండూరు పట్టణ కేంద్రంలో కొనసాగుతున్న 'హాత్ సే హాత్ జూడో' యాత్రలో నాయకులు పాల్గొని, బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలనలో ఏ ఒక్కరికీ డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని విమర్శించారు. కరెంట్ బిల్లులు మోత మోగు తోందనీ, సిలిండర్ ధర ఆకాశానంటిందని, నిత్యవసర సరుకులు సామాన్యులు కొనలేని స్థితిలో ఉన్నారని అన్నారు. అంతేకాకుండా పండించిన పంటలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వకపోవడంతో రైతులు అప్పులపాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, ఉత్తమ్ చంద్ జనార్ధన్‌రెడ్డి, నర్సింలు నర్సిరెడ్డి, తాండూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మెన్ అలీమ్, టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్‌గౌడ్, కావలి సంతోష్ కుమార్, నాగేష్, మల్లికార్జున్,పి. బసవరాజ్, సర్దార్‌ఖాన్, రాము నాయక్, మెకానిక్ రాజు, మాజీ కౌన్సిలర్ రవి కుమార్, భీమ్ శంకర్, బతుల వెంకటేష్, తాండూర్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాబిబ్ లాలా, తాండూర్ టౌన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాము, తాండూర్ టౌన్ మైనార్టీ ప్రెసిడెంట్ కాజా రియాజుద్దీన్, కాంగ్రెస్ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు బషారత్, మాజీ కౌన్సిలర్ వడ్డే శ్రీని వాస్, హబీబ్ బంటు వేణు, కాలేద్, బాతుల వెంకటేష్, రాము నాయక్, జావిద్,జలాల్ , సమాద్, కయ్యం పాషా సయ్యద్ నవాజ్ , తదితరులున్నారు.