Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం రిలీఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
నవతెలంగాణ-శంషాబాద్
ప్రజలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న బాధితులకు రూ.3.97 లక్షల చెక్కులను గురువారం రాజేంద్రన గర్ శాసనసభ్యులు టి.ప్రకాష్‌గౌడ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ వైద్యం కోసం అధిక నిధులు కేటాయించి సత్వర వైద్యం అందిస్తున్నారని అన్నారు. పరిస్థితులను బట్టి ప్రయివేటులో వైద్యం చేయిం చుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద దరఖాస్తు చేసు కుంటే ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. మండల పరిధిలో ని రషీద్ తాండాకు చెందిన కే. తుల్స రూ.60 వేలు, పెద్ద గోల్కొండ గ్రామానికి చెందిన నర్సింహ రూ. 24000, సహదేవ్ రూ. 19,000, సీహెచ్ లక్ష్మమ్మ రూ.16,000, పాలమాకుల గ్రామానికి చెందిన ఎం.రత్నం రూ. 300 00, సుశీల రూ. 60000, పిల్లోని గూడకి చెందిన డి.రాజు రూ.31,000, హామీదుల్లానగర్కు చెందిన బి. నర్సింగ్ యాదవ్ రూ. 24000, రషీద్ గుడాకి చెందిన శరీఫాబే గం రూ. 32000, నర్కూడకి చెందిన కే . యాదయ్య గౌడ్ రూ. 44000, బి. నరసింహ రూ.31500, జూకల్ గ్రామానికి చెందిన పి.రుక్మిణి రూ. 36000, ముచింతల్ గ్రామానికి చెందిన కే.పెంటమ్మ రూ.20000ల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డిద్యాల జయ మ్మ శ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్వి రాజు, పీఏసీఎస్ చైర్మన్లు బొమ్మ దవనాకర్గౌడ్, బి. సతీష్, సర్పంచ్ వట్టెల సతీష్‌యాదవ్, ఎంపీటీసీ డి.యాదగిరి, ఉపసర్పంచులు జగన్మోహన్ రెడ్డి, ఏ. కృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంచర్ల మోహన్‌రావు, గుడాల కృష్ణ, రవినాయక్, మోహన్‌రావు, సత్యానందం, నర్సింహ, చరణ్, డి.శ్రీనివాస్, దేవేందర్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ ఏ. శ్రీకాంత్‌గౌడ్, సందనవెళ్లి శ్రీనివాస్, గుండాల విశ్వనాథం, హీరేకార్ శివాజీ, నీరటి అశోక్, ప్రశాంత్ , రమేష్, కత్తుల జనార్ధన్, మంచాల రవి, సహదేవ్, నరసింహ, గిరి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.