Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మియాపూర్
మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తాండ ల్యాండ్ విషయమై సీిఆర్పిఎఫ్ ఏడీజీని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా సీఆర్పిఎఫ్, నడిగడ్డ తాండవ వాసుల మధ్యలో ల్యాండ్ విషయంపై అనేక దఫాలుగా చర్చలు జరిగిన ల్యాండ్ తాండవాసులకు ఇచ్చే విషయంపై స్పష్టత రాలేదన్నారు. ఈ విషయంపై ఏడీజీని కలిసినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు సీఆర్పీఎఫ్ వారి అవసరాల కోసం కేటాయించిన స్థలంపై కొన్ని విభేదాలు ఉన్నాయని తెలిపారు. వాటిని త్వరలోనే పరిష్కరించి నడిగడ్డ తాండవాసులకు శుభవార్త చెబుతామని ఎంపీ తెలిపారు.