Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
నవతెలంగాణ-గండిపేట్
పేదలు సీఎంఆర్ఎఫ్ను సద్వినియోగం చేసుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పుప్పాల్‌గూడ గ్రామానికి చెందిన మహేందర్‌కు ఆనారోగ్యంతో ఉండడంతో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ మణికొండ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులకు శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంల్లో బీఆర్ఎస్ మణికొండ అధక్షులు బుద్దొలు శ్రీరాములు, కౌన్సిలర్లు వసంత ఛౌహాన్, గుట్టమీది నరేందర్, ఎర్పుల కుమార్, శ్రీకాంత్, శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.