Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలోని మంతన్ గౌరెల్లిలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి శుక్రవారం పర్యటించి, వడగండ్ల బాధితులను పరామర్శించారు. అనంతరం బాధితులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని ఆయన అంచనా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షా లతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, దీంతో అపార నష్టం జరిగిందన్నారు. గ్రామంలో ప్రతి ఒక్క ఇండ్ల పై కప్పు ధ్వంసమైయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితులకు వెంటనే పరి హారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య భాషా, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి మర్రిపల్లి అంజయ్య యాదవ్, బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవీందర్, నాయకులు బోసుపల్లి ప్రతాప్, పోరెడ్డి నరసింహారెడ్డి, జంగయ్య గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా నాయకుడు నక్క శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.