Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి
నవతెలంగాణ-మంచాల
ఏప్రిల్ 5న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి ప్రజా సంఘాలకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని చీదెడ్, రంగాపూర్, ఎల్లమ్మతండా గ్రామాల్లో జీపు జాత నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామా ల్లో జీపు జాత చేపట్టన్నుట్టు తెలిపారు. ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో ఆ జాతలో పాల్గొనీ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వృత్తి సంఘాల నాయకులు, మాజీ జడ్పీటీసీ పగడాల యాదయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కవిత, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు నాగిల్ల శ్యామ్ సుందర్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు రావుల జంగ య్య, డీవైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి సిలివేరు రాజు, మం డల అధ్యక్ష, కార్యదర్శులు దేవరకొండ రామకృష్ణ, రత్నావత్ స్వామి, వ్యకాసం మండలాధ్యక్షులు ఆవుల యాదయ్య, రైతు సంఘం మండలాధ్యక్షులు లట్టుపల్లి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు డబ్బికార్ అజరు బాస్, రంగాపూర్ సర్పంచ్ డబ్బికార్ మమత అజరు బాస్, నాయకులు జగన్, లెనిన్, హాఫిజ్ పాషా, కర్నాటి వెంకన్న తదితరులున్నారు.