Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అనిత
నవతెలంగాణ-షాబాద్
పాఠశాల స్థాయి నుంచే బాలికల రక్షణ. లైంగిక వేధింపుల నిరోధానికి కృషి చేయాలని జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అనిత అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో విద్యార్థినీలకు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభం శుభం తెలియని చిన్నారులపై కామాంధుల కండ్లు పడుతున్నాయని, చాలా సందర్బాల్లో తెలిసిన వారి దుశ్చర్యే ఇదని, ఈ తప్పు జరగకుండా ఉండాలంటే మన పిల్లలకు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అన్నది తెలియాలన్నారు. తాకకూడని చోట ఎవరైనా తడిమితే, భయపడకుండా డోంట్ టచ్మీ అని గట్టిగా అరిచేలా చెప్పాలన్నారు. బాడ్ టచ్ విషయంలో ముఖ్యంగా తల్లికి పూర్తి సమాచారం తెలియజేయాలన్నారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, ఇంట్లో సమస్యగా ఉంటే పాఠశాలలో ఉపాధ్యాయులకు విషయం తెలియా జేయాలని చెప్పారు. చదువుకునే ప్రాయంలో విద్యా ర్థులు సోషల్ మీడియా జోలికి వెళ్లకూడదని సూచించారు. సోషల్ మీడి యా వల్ల చదువులు పాడై ఆ తర్వాత బుద్ధి పాడై అనేక వ్యసనాలకు బాని సలుగా మారాల్సి వస్తుందన్నారు. చదువుకునే వయసులో విద్యార్థులు చిన్నప్పటినుండే ఎంతో ఏకాగ్రతతో చదవాలని కష్టాన్ని ఇష్టపడి బాగా రాణించా లన్నారు. దీనికి సంబందించిన అనేక ఉదాహరణలు చెబుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ శ్రీవాచ్చ, వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.