Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ కోఆర్డినేటర్ న్యాయవాది యాదిలాల్
- ఆయా గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటల పరిశీలన
నవతెలంగాణ-ఆమనగల్
గురువారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి కల్వకుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ ప్రముఖ న్యాయవాది అండేకార్ యాదిలాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన స్థానిక టీడీపీ నాయ కులతో కలిసి మండలంలోని కోనాపూర్ తదితర ప్రాంతా ల్లో వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలతో పాటు ఆమన గల్ మార్కెట్ యార్డుకు తెచ్చిన తడిసిన వేరుశనగ పంటను పరిశీలించారు. ఈసందర్భంగా యాదిలాల్ మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయ, రెవెన్యూ శాఖల ద్వారా దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించి రైతు లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.