Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలిండియా పురాతన దేవాలయ పునరుద్ధరణ ట్రస్ట్ చైర్మెన్ ఆర్కెజైన్
- నియోజకవర్గ ఎమ్మెల్యే కాలే యాదయ్య,ఎమ్మెల్సీ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-మొయినాబాద్
పురాతన ఆలయాలను పునరుద్ధరించడమే తమ లక్ష్యమని ఆలిండియా పురాతన దేవాలయ పునరుద్ధరణ ట్రస్ట్ చైర్మెన్ ఆర్ కె జైన్ అన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం. ట్రస్ట్ సభ్యులు నటుడు సుమన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండలంలోని పెద్ద మంగళారం గ్రామ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణానికి సర్పంచ్ కోట్ల నరోత్తంరెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాల క్రితం నాటి శిథిలావస్థకు చేరిన పురాతన ఆలయాన్ని గుర్తించి పున: నిర్మిస్తున్న పురాతన ఆలయ పునరుద్ధరణ ట్రస్ట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. కనుమరుగవుతున్న సంస్కృతి సాంప్రదాయాలను ప్రాధాన్యతనిస్తూ మరుగునపడి శిథిలావస్థకు చేరిన ఆలయాలను, భావితరాలకు ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేద్దామన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి చైర్మెన్ మనోహర్ రెడ్డి, జడ్పీటీసీ కాలేజ్ శ్రీకాంత్ మాజీ జడ్పీటీసీ కంచర్ల భాస్కర్, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు జైపాల్ రెడ్డి, సత్తిరెడ్డి, లక్ష్మీనారాయణ, ప్రభాకర్, వెంకట్రెడ్డి, వీరారెడ్డి, వెంకటేష్, నవీన్, దోమ కృష్ణ, తిరుపతిరెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.