Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-ఆమనగల్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని తిమ్మి నోనిపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
-మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం
నియోజకవర్గంలోని తుర్కలపల్లి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదానికిగురై మృతి చెందిన బి.దుర్గయ్య, పి.రామస్వామి కుటుంబాలను శుక్రవారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. తన వంతు తక్షణ సహాయంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 వేల చొప్పున మొత్తం 20 వేలు ఆర్థికసాయం అంద జేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లయ్య, పెద్దాపూర్, నారాయణపూర్ గ్రామాల సర్పంచ్‌లు గోరటి శ్రీనివాస్, అంజి నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ నాగులు నాయక్, ఏఎంసీ డైరెక్టర్ సురమళ్ల సుభాష్, నాయకులు ధర్మ నాయక్, శత్రు నాయక్, శివకుమార్, రాజ శేఖర్, శేఖర్, గోపి, ప్రశాంత్, గణేష్, చింటూ, శివ, సంతు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.