Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులను ఆదుకుంటాం : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
నవతెలంగాణ-మంచాల
వడగండ్ల వానకు పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం ఆదుకుం టుందనీ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్ర వారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో పంట నష్ట పొలాలను ఎమ్మెల్యే పరి శీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎవ్వరు ఆందోళన చెందవద్దనీ, వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి పంట నష్ట నివేదికను పైఅధికారులకు అందజేసి, ప్రభుత్వం ద్వారా పంట నష్టం వచ్చే విధంగా కృషి చేస్తామని హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట చారి, ఏడీ సత్య నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మెన్ ఏర్పుల చంద్రయ్య, ఎంపీపీ జాటొత్ నర్మదా లచ్చిరాం, ఆరుట్ల ఎంపీటీసీ చీరాల రమేష్, బొడకొండ ఉపసర్పంచ్ అలివేలు బిచ్యానాయక్, ఆర్ఐ శ్వేత కాట్రోత బహదూర్ తదితరులు పాల్గొన్నారు.