Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ జి.కవిత
- పలు గ్రామాల్లో ప్రజా సంఘాల జీపు జాత
- ఏప్రిల్ 5న చలో ఢిల్లీని జయప్రదం చేయాలి
నవతెలంగాణ-యాచారం
అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికుల జీతాలపై సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వాలు అమలు చేయాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ జి. కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం యాచారం మండల పరిధిలోని మేడిపల్లి, తక్కళ్లపల్లి, కొత్తపల్లి, కిషన్పల్లి, మాల్, మంతన్ గౌరెల్లి గ్రామాల్లో ప్రజా సంఘాల జీపు జాత కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులందరికీ నెలకు రూ.26వేల జీతం ఇవ్వాలని కోరారు.పెరిగిన నిత్యావసరాల ధరలతో కార్మికులంతా సతమతమవుతున్నారని తెలిపారు. మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని శ్రామికలోకమంతా ఐక్యంగా పోరాడి గద్దెదించాలన్నారు.
ఏప్రిల్ 5వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి.అంజయ్య, కేవీపీఎస్ జిల్లా నాయకులు అలంపల్లి నరసింహ, ఉప సర్పంచ్ కావాలి జగన్, డీవై ఎఫ్ఐ నాయకులు అలంపల్లి జంగయ్య, ఎస్ఎఫ్ఐ నాయ కులు శంకర్, చరణ్, విప్లవ కుమార్, పాల్గొన్నారు.