Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైౖతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. జంగారెడ్డి
- మంతన్గౌరెల్లిలో రైతు సంఘం, సీపీఐ(ఎం) నాయకుల పర్యటన
నవతెలంగాణ-యాచారం
వడగండ్ల వానతో జరిగిన పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. జంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం యాచారం మండల పరిధిలోని మంతన్గౌరెల్లిలో గురువారం సాయంత్రం పడిన వడగండ్ల వానతో ధ్వంసమైన ఇండ్లు, పంట నష్టాన్ని రైతు సంఘం, సీపీఐ(ఎం) నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జంగారెడ్డి మాట్లాడుతూ వడగండ్ల బాధితులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందేలా చూడాలని కోరారు. ఇంటి పై కప్పులు వడగండ్లతో పూర్తిగా చిల్లులు పడ్డాయన్నారు. కురిసిన వర్షంతో రాత్రంతా బాధితులు జాగారం చేశారని తెలిపారు. వందల కొద్ది ఎకరాల అంతా నష్టం జరిగిందని చెప్పారు. కనీసం వారు వండుకోవడానికి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా తడిసిపోయాయని వివరించారు. ప్రభుత్వ అధికారులు వెంటనే పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆయన పేర్కొన్నారు. దాదాపు 400 పైగా ఎకరాల వరి, టమాట, ఇతర పంట నష్టం జరిగిందని తెలిపారు. గ్రామంలో పూర్తిగా వడగండ్ల వానతో 610 మందికిపైగా ఇంటి పైకప్పులకు రంద్రాలు పడ్డాయని అన్నారు. వడగండ్ల బాధితులందరికీ నిత్య వసరాలు ప్రభుత్వం అందించకపోవడం బాధాకర మన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నష్టపోయిన వడగండ్ల బాధితులను ఆదుకొని పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు కవిత, కందుకూరి జగన్, పి.అంజయ్య, ముసలయ్య, తావునాయక్, ఐలయ్య, శంకర్, చందునాయక్, అలంపల్లి జంగయ్య, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
విపత్తు నిబంధన ప్రకారం పరిహారం ఇవ్వాలి :కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండ రెడ్డి
వడగండ్ల వానతో నష్టపోయిన పంటలకు, దెబ్బతిన్న ఇండ్లకు విపత్తు నిబంధనల ప్రకారం పరిహారం అందించాలని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండ రెడ్డి డిమాండ్ చేశారు. మంతన్ గౌరెల్లి లో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలు, ఇండ్లను ఆయన పరిశీ లించారు. నష్టపోయిన బాధితులకు తక్షణ సాయం అందిం చడంలో ప్రభుత్వం పూర్తిగా విప్లమైందని మండిపడ్డారు. అనంతరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు మర్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తనకు తెలిసి ఇంత పెద్ద ప్రకృతి విపత్తు ఎప్పుడూ జరగలేదని తెలిపారు. ఆరుగాలం కష్టపడి పని చేసిన వరి పంట, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి, వడగండ్ల బాధితులను ఆదుకుని, తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.