Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాదాపు 349 ఎకరాల పంట నష్టం
- 552 పైగా ఇండ్లు ధ్వంసం
- అతి త్వరలో పరిహారం అందిస్తాం
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
- నష్టపోయిన పంటలు పరిశీలన
నవతెలంగాణ-యాచారం
వడగండ్ల వానతో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హామీనిచ్చారు. శుక్రవారం యాచారం మండల పరిధిలోని వడగండ్ల వానతో నష్టపోయిన మంతన్ గౌరెల్లి, మంతన్ గౌడ్, సుల్తాన్పూర్, మొండిగౌరెల్లి గ్రామాలను ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. జరిగిన నష్టాన్ని అధికారులతో అంచనా వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వడగండ్ల వానతో రేకుల ఇండ్లు పూర్తిగా చిల్లులు పడ్డాయని అన్నారు. వర్షం పడితే ఉండడానికి కూడా వీలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి బీభత్సంతో ప్రజలంతా నష్టపోయారని గుర్తు చేశారు. దాదాపు మంతన్ గౌరెల్లి, మొండిగౌరెల్లి గ్రామాల్లో అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం 349 ఎకరాల పంట నష్టం, 552 పైగా ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యా యని తెలిపారు. జరిగిన నష్టాన్ని రైతులు, పేద కుటుం బాలు తమతో వారి బాధలు వెలిబుచ్చారని వివరించారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి పై అధికారులతో మాట్లాడి పరిహారం త్వరలోనే అందజేస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మెన్ కొత్త కురుమ సత్తయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, ఆర్డీవో వెంకటాచారి, జడ్పీటీసీ చిన్నోళ్ళ జంగమ్మ యాదయ్య, తహసీల్దార్ సుచరిత, ఎంపీడీవో విజయలక్ష్మి, వ్యవసాయ అధికారి సత్య నారాయణ, పీఎసీఎస్ చైర్మెన్ రాజేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ కారింగ్ యాదయ్య, సర్పంచ్ విజయలక్ష్మి, బీఆర్ఎస్ మండలా ధ్యక్షులు రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి పాశ్చ భాష, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.