Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇటీవల నలుగురు యువకులపై కేసు నమోదు
- నామమాత్రపు కేసులతో సరిపెట్టిన పోలీసులు
- 150 మందికి వరకు గంజాయి మత్తుకు బానిసలు
- వెంచర్లు, కళాశాలలు, నిర్మానుశ్య ప్రాంతాలే వారి అడ్డాలు
- సమాచారం ఇస్తేనే అధికారుల హడావిడి
నేటి యువత గంజాయి, నాటు సారా వైపు మొగ్గుచూపుతున్నారు. బర్త్ డే, పార్టీల పేరుతో ఎంజారు చేస్తూ తల్లిదండ్రులకు శోకాన్ని మిగుల్చుతున్నారు. తాగిన మత్తులో దాడులు చేస్తూ కేసుల పాలవుతున్నారు. ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యార్ధులు ఈ ఊబిలో చిక్కుతున్నారు. రోజుకు ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కానీ అదుపు కావడం లేదు. విస్తృతంగా తనిఖీలు చేయడకపోవడం, ఒక వేళ పట్టుబడినా వారి పట్ల కఠినంగా వ్యవహరించకపో వడమే ప్రధాన కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నం డివిజన్లో గంజాయి, నాటు సారా దందా చేసే వారు అత్యంత రహస్యంగా పాఠశాల, కళాశా ల, ఇంజీరింగ్ విద్యార్థులు టార్గెట్‌గా చేసుకుని విక్రయాలు జరుపుతున్నారు. వీటి ధరలు తక్కువగా ఉండడంతో మత్తు కావాలని కోరుకునే వారు వాటిని డబుల్ డోస్‌ల కింద వాడేస్తున్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారంలో నలుగురు యువకులు కలిసి గ్రామ సమీపంలోని వెంచర్లో గంజాయి తాగుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి పోలీసులు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు కూడా నమోదు చేశారు. నామమాత్రపు సెక్షన్లు నమోదు చేయడంతో వారికి అదే రోజు బెయిల్ లభించింది. పట్టుబడింది నలుగురే అయినా ఆ గ్రామంలో సుమారు 200 మందికి పైగా మ త్తుకు బానిసలైనట్టు స్థానికులు బహిరంగంగా చర్చించుకుం టున్నారు. ఇటీవల వివాహ ఊరేగింపులో మత్తులో ఓ యువకుడిపై విచక్షణారహితంగా కర్రలు, ఇనుప చువ్వలతో దాడులు చేశారు. ఈ ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు అయింది. ఈ ఘటన జరిగిన వారం రోజులకు గంజాయి తాగుతూ నలుగురు యువకులు పోలీసులకు పట్టుబడ్డారు.
వీకెండ్లలో జోరు...
సాధారణ రోజుల్లో కన్నా వారాంతపు రోజులు శని, ఆదివారాల్లో మత్తుబాబులు పండుగ చేసుకుంటున్నారు. ఇక పుట్టిన రోజు వేడుకులు, ఫంక్షన్లు పేరుతో ఇక రెచ్చిపోతు న్నారు. గంజాయికి అలవాటు పడ్డ యువత సిగరెట్లలో పెట్టుకుని పీలుస్తున్నట్లు తెలుస్తుంది. ఇక గంజాయిని, నాటు సారా తాగి డ్రంకన్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు దొరి కినప్పుడు వారి కౌంట్ 300 దాటడం కలవరం రేపుతోంది.
తల్లిదండ్రులు గమనించాలి...
యువకులకు మత్తు వదిలించాలంటే తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. వారి పిల్లల అలవాట్లు, వారి కాలేజీ విద్యాభ్యాసం, రోజు వా రి కార్యకలాపాలు, ఇంటికి వచ్చే సమయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వీటిలో ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే అనుమా నించి వాటిపై ఆరా తీసి నియంత్రణ చర్యలు చేపట్టాలి. లేదంటే మీ పిల్లలు దారి తప్పే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అమాయకులకు ఆశచూపుతూ..
నిరుపేద, ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న అమా యకులకు ఆశచూపుతూ గంజాయి దందా ఉచ్చులోకి దింపుతున్నారు. ఒకవేళ పోలీసులకు దొరికిన తమపేరు బయటకు రాకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు. భారీ వాహనాలలో తరలిస్తే పట్టుబడే అవకాశం ఉంటుందన్న ఉ ద్దేశంతో ఎవరికి అనుమానం రాకుండా కొందరు యువకు లకు ద్విచక్ర వాహనాలను అందించి గంజాయిని సరఫరా చేస్తున్నట్టు విమర్శలున్నాయి. చిన్న చిన్న బ్యాగుల్లో హైద రాబాద్ లాంటి పట్టణాలకు తరలిస్తున్నారు. ఎండు గం జాయిని పొడిగా మార్చి చిన్న, చిన్న ప్లాస్టిక్ కవర్లలో నింపు తూ ఎవరికి ఎంత కావాలంటే అంతా అందజేస్తున్నారు. రూ.100 నుంచి వేలల్లో అమ్మకాలు జరుపుతున్నారు.
నిద్ర మత్తు వీడని ఎక్సైజ్‌శాఖ
గ్రామాల్లో విచ్చలవిడిగా నాటుసారా, గంజాయి విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు నిద్ర మత్తు వీడటం లేదు. గంజాయి విక్రయాలు జరుగుతున్నా యనేందుకు దండుమైలారం ఘటననే ఉదాహరణ. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు తమకేమీ సంబం ధం లేదనట్లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో పోలీసుశాఖ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది.
అదుపు చేయకుంటే అశాంతి
గంజాయి విక్రయాలు జరుపు తున్నట్టు అనుమానాలు న్నాయి. అదుపు చేయకుంటే గ్రామాల్లో అశాంతి నెలకొనే ప్రమాదం ఉంది. ఇటీవల నలుగురు యువకులు గంజాయి తాగుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిపై కేసులు కూడా నమోదయ్యా యి. గ్రామంలో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, యువతను కాపాడేందుకు ఎక్సైజ్, పోలీసు శాఖ తగు చర్యలు తీసుకోవాలి. గంజాయి, మత్తుకు బానిసలైతే కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి.
- రమణమోని జంగయ్యముదిరాజ్, గ్రామస్తుడు