Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టం పరిహారం చెల్లించాలని రైతుల వినతి
నవతెలంగాణ-బంట్వారం
భారీగా కురిసిన వడగండ్ల వర్షానికి రైతుల పంటలు పాడైపోవడం తో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నా రు. రైతులు పండించిన మొక్కజొన్న, టమాటా, అరటి ఇతర పంటలు చేతికి అందేలోపు ఈ ఆకస్మిక వర్షానికి పంట లు పాడై పోవడంతో రైతులకు దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మలసోమారం గ్రామానికి చెందిన కొండల్‌రెడ్డి అనే రైతు నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించాడు. భారీ వర్షానికి మొక్క జొన్న నేలకొరిగింది. రైతులం దరూ నష్టపోయిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. మరో వైపు ఎంపీ రంజిత్ రెడ్డి, విద్య శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నియోజ కవర్గంలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. భారీ వర్షానికి నష్ట పోయిన రైతుల పంటలకు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసానిస్తున్నారు.