Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా ఉపాధ్యక్షులు అలువాల రవికుమార్
- కొత్తూరు మండలానికి చేరుకున్న జీపుజాత
నవతెలంగాణ-కొత్తూరు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అలువాల రవికుమార్ అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీపు జాత కార్యక్రమం ఆదివారం నందిగామ, కొత్తూరు మండలాలకు చేరుకుంది. కొత్తూరు, నందిగామ మండలాలలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బీసా సాయిబాబు ఆధ్వర్యంలో జీపు జాత యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం లో ఆలువాల రవికుమార్ మాట్లాడుతూ... బీజేపీ ప్రభు త్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలం దరికీ తెలియజేసేందుకు జీపు జాత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. శనివారం శంకర్పల్లిలో ప్రారంభమైన ఈ యాత్ర ఈనెల 23న ఇబ్రహీంపట్నంలో ముగిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడమే కాకుండా నిత్యవసర సరుకులు ధరలను పెంచడం వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవలసిన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కులాలను విడదీస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజు, శ్రీను, నర్సింగ్ రావు, మహేందర్, నర్సింలు, లక్ష్మయ్య, పెంటయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.