Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్
- ఆమనగల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన, కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-ఆమనగల్
నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్ని బాధ్యత లేని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని టీపీ సీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ విషయంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వైఖరికి నిరసనగా ఆదివారం ఆమనగల్ పట్టణం లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మండ్లి రాములు ఆధ్వర్యం లో కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహిం చారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ కార్య వర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా ఉద్యోగాలు మాకే వస్తాయని ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న వారిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్, కార్యదర్శి గుజ్జుల మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహముదిరాజ్, ఉపా ధ్యక్షుడు ఖలీల్, టౌన్ అధ్యక్షులు వస్పుల మానయ్య, కడ్తాల్ మండల అధ్యక్షుడు బిచ్చానాయక్, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, యువజన కాంగ్రెస్ నాయకులు కృష్ణనాయక్, రాఘవేందర్, అలీమ్, సురేష్, అజీమ్, రాజ శేఖర్, భగవాన్ రెడ్డి, మలె మల్లేష్, రాంచందర్‌నాయక్, కొండల్‌రెడ్డి, ఎక్బాల్, బాబా, శ్రీధర్, శ్రీను, డిగ్రీ కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.