Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్.రాజు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి జగన్
నవతెలంగాణ-షాద్‌నగర్
ఏప్రిల్ 5 తేదీన జరిగే చలో ఢిల్లీ మద్దూర్ కిసాన్ సంఘర్ష ర్యాలీని జయప్రదం చేయగలరని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్.రాజు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి జగన్ అన్నారు. సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 16 నుంచి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న జీపు జాత శనివారం సాయంత్రం చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్ మీదుగా షాద్‌నగర్‌కు చేరుకుంది. ఆదివారం భవన నిర్మాణ కార్మిక అడ్డ దగ్గర తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్ రాజు, వ్యవసాయ కార్మిక కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రవి హాజరై మాట్లాడారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు. కనీస వేతనాల అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వివిధ దేశాలలో కార్పొరేట్ పరిశ్రమలు సంస్థల వారు దాచుకున్న నల్లధనాన్ని వెలికి తీసి పేద ప్రజలకు పంపిణీ చేయాలని అన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై పలు సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ ఐదో తారీకు ఢిల్లీలో జరిగే మహా ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్య క్రమంలో ప్రజా సంఘాల నాయకులు బిజిలి సత్యం, కుర్మ య్య, చంద్రమౌళి, మీదిపేట రాజశేఖర్, కావాలి రాజు, ము న్సిపల్ కార్మికులు రాజు, సాయిలు, వెంకటేష్, యాదయ్య, రాములు, పాండునాయక్, శ్రీనివాస్, ధనుంజరు, శేఖర్, రమేష్, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.