Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
రైతులను ఆదుకోని వెంటనే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు. ఆదివారం ఆయన మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఇద్దరు మంత్రులు మర్పల్లి మండలంలో హెలిక్యాప్టర్ వచ్చి పరిశీలించండం సంతోషకరమని అన్నారు. మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పడమే వారి అధికారానానికి అర్థం పడుతుందని, గతంలో స్థానిక మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రుల మంత్రి వర్గంలో పని చేశారని గుర్తు చేశారు. సంఘటన స్థలం నుంచి ముఖ్యమంత్రులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. మర్పల్లి మండలంలో 30 వ్యవసాయ కేంద్రాలను సందర్శించానని తెలిపారు. టమాట, క్యాబేజీ, జొన్న, మొక్క జొన్న, బొప్పాయి, మామిడి పంటలు పూర్తిగా పాడయ్యాయని తెలిపారు. రైతు ఎకరాకు రూ.70 వేల లాగోడి పెట్టారని, వారిని ఆదుకోవాలని కోరారు.