Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ-పరిగి
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరాఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రామ్మోహన్‌రెడ్డి అధ్వర్యంలో పరిగి పట్టణ కేంద్రంలోని హైదరాబాద్ టు బీజాపూర్ హైవేపై పార్టీ నాయకులు ఆదివారం ధర్నా నిర్వహించారు. దాదాపు గంటన్నరసేపు హైవేపై రాస్తా రోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అనం తరం కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం రా మ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రూప్ -1 పేపర్ లీక్ విష యంలో మంత్రి కేటీఆర్ తమ తప్పు లేదని మాట్లాడడం సిగ్గు చేటు అన్నారు. రాష్ట్రంలో పాలన అధ్వాన్నంగా మారిందన్నారు. స్వరాష్ట్రంలోనూ నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదన్నారు. పేపర్ లీకేజీలో ఎవరు ఉన్నారో నిగ్గు తేల్చి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పిఈటి రాములు, డీసీసీ ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి, లాల్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి హనుమంతుముదిరాజ్, పట్టణ అధ్యక్షులు ఏర్రగడ్డపల్లి కృష్ణ, మండలాల అధ్యక్షులు సురేందర్‌ముదిరాజ్, విజయ్‌కుమార్‌రెడ్డి, ఆంజనేయులు ముదిరాజ్, నారాయణ, సీనియర్ నాయకులు కమతం వి ష్ణువర్ధన్రెడ్డి, మత్స్యకార జిల్లా అధ్యక్షులు బెస్త ఆంజనే యులు, నర్సింలు, జిల్లా కార్యదర్శులు అశోక్, యువజన నాయకులు నాగవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.