Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
- వడగండ్ల వానతో నష్టపోయిన పంట పొలాల పరిశీలన
నవతెలంగాణ-కోట్‌పల్లి
అకాల వర్షానికి వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునేలా చూస్తామని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, వికారాబాద్ శాసనసభ సభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం, శనివారం కురిసిన అకాల వర్షానికి పంటలు నష్టపోయిన విషయాన్ని తెలుసుకున్న వారు మోమిన్‌పేట్ మండల పరిధిలోని సైదల్లిపూర్, ఇజ్రాచిట్టం పల్లి, కేసారం గ్రామాల్లో ఆదివారం పర్యటించారు. పంట నష్టపోయిన రైతుల పొలాలలోకి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటామ న్నారు. ప్రతి రైతుకూ బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉం టుందని హామీ ఇచ్చారు. రైతులు ఎవ్వరు అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. ఈ సమాచారాన్ని సీఎం కేసీఆర్ దృష్టి కి తీసుకెల్లి రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నా రు. ఇప్పటికే మర్పల్లి మండలంలో నష్టపోయిన రైతుల పంట పొలాలను సంబంధిత శాఖ మంత్రులు పరిశీ లించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకన్న, మార్కె ట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, సైదల్లిపూర్ సర్పంచ్ సత్యనారా యణరెడ్డి, ఇజ్రాచిట్టెంపల్లి సర్పంచ్ కాశిరాం, కేసారం సర్పంచ్ చంద్రకళ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.