Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నం పెట్టే రైతన్నపై వడగండ్ల దెబ్బ
- రైతన్న ఆశలు అడియాశాలే
- మొక్కజొన్న, ఉల్లిగడ్డ, జొన్న, పంటలు నాశనం
- నేలపాలైన చామంతి, బంతి పూలు పెట్టిన పెట్టుబడులు సైతం వృథా
- ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల ఆవేదన
నవతెలంగాణ-కోట్పల్లి
ఎప్పుడూ లేని విధంగా ఉత్తర దక్షిణ ద్రోహి ప్రభావంతో కోట్పల్లి మండల పరిధి లోని వివిధ గ్రామాల్లో అకాల వర్షంతో పాటు వడగండ్ల వాన కురిసింది. వర్షాకాలంలో కురిసే విధంగా కంటే అధికంగా కురవడంతో ఎండాకాలంలో రైతులు వేసుకున్న పంటలు తీరా కోతకొచ్చే సమయానికి అకాల వర్షంతో వడగండ్ల కురవడంతో పంటలు నాశనమై పెట్టిన పెట్టుబడికి సైతం లేకుండా నేలపాలై పోయాయి. మండల పరిధిలోని బార్వాద్, మోత్కుపల్లి, ఎన్కేపల్లి, జిన్నారం, మద్గుల్ తం డా తదితర గ్రావల్లో మొక్కజొన్న ఉల్లిగడ్డ జొన్న కుసుమ, మిర్చి, టమాట, సొరకాయ, కర్భుజ, చేమంతి, బంతి, పంటలతోపాటు వి విధ పంటలు అకాల వర్షంతో పాటు భారీగా కురిసిన వడగండ్లతో పంటలు మొత్తం నాశన యమయ్యాయి. ఎన్నడూ చూడని విధంగా ఎండాకాలంలో కురిసే ఇలాంటి వర్షాలు వడ గండ్ల వాన కురవడం ఆశ్చర్యానికి గురవుతు న్నమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో వర్షాలకు ఎలాంటి ఇబ్బందు లూ ఉండవని కొద్ది పాటి నీళ్లతో పెట్టుబడులు అధికంగాపెట్టి పంటలు పండించుకుందామనే రైతులకు వరుణుడు కన్నెర్ర చేయడంతో పంట లు మొత్తం నేలపాలయ్యాయి. నష్టపోయిన రైతులను అధికారులు సర్వే చేసి నష్టం అంచ నవేయాలని ప్రభుత్వం ఈ రైతులను ఆదుకో వాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండురోజులుగా కురిసిన భారీ వర్షానికి పంటలు మొత్తం దెబ్బ తిన్నాయని అక్కడ క్కడా కొన్ని రేకుల ఇం డ్లు, చెట్లు విరిగి నష్టం జరి గింది. ప్రభుత్వం వీట న్నింటినీ గుర్తించి నష్ట పరిహారం చెల్లించా లని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
- బాబునాయక్, రైతు
నాకున్న పొలం లో 6 ఎకరాల్లో టమాట, సొరకా య, మిర్చి, కర్భుజ పంటలు వేశాను. దీనికి పెట్టుబడి దాదాపుగా రూ.2 లక్షల వరకు ఖర్చుఅయింది. అకాల వర్షానికి వడ గండ్ల వానతో చేతికొచ్చిన పంట మొత్తం పడడంతో పెట్టిన పెట్టుబడి సైతం నష్టపో యాను. పంట పడితే నాకు ఖర్చులుపోను రూ.10 లక్షలవరకు ఆదాయం వస్తుండే. నష్టపోయిన పంటకు ప్రభుత్వం ఆదుకుని పరిహారం చెల్లించాలి.
- రైతు కిష్టారెరెడ్డి, మోత్కుపల్లి
నేను 2 ఎకరాల్లో టమాట, జొన్న పంట లు వేశాను. శుక్రవారం, శనివారం కురిసిన ఆకా లవర్షానికి కురిసిన వ ర్షానికి 2 ఎకరాల్లో పంట మొత్తం నేల పాలై యింది. దీనికి రూ.50 వేల పెట్టుబడి పెట్టి న ఫలితం లేదు. పంటలు పండిస్తే లాభాలు వస్తాయేమో అనుకుని పెట్టుబడులు పెడితే ఈ వర్షంతో నష్టమే జరిగింది. అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి తెలిపి నష్టపరిహారం చెల్లించాలి.
- పరుశరాం, రైతు