Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
నవతెలంగాణ-కొడంగల్
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ మండలంలోని గుండేపల్లి వీర భద్రేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో ఫంక్షన్ హాల్లో బీ ఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ల ఆదేశాల ప్రకారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. స ర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు బీఆర్ ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను చర్చించి ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని విధంగా సంక్షే మ పథకాల కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. ఇల్లు లేని వారికి ఇండ్లు, దళితబంధు కూడా వస్తుందన్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ట్యాంకు బం డు దగ్గర ప్రారంభానికి గ్రామాల నుండి బస్సులు ఏర్పాటు చేస్తున్నామని పెద్ద ఎత్తున తరలిరావా లని పిలుపునిచ్చారు. గతంలో కాంగ్రెస్ ప్ర భుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయలేదన్నారు. వచ్చే ఎన్నిక ల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మరోమారు గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్నారు, గతానికి ఇప్పటికీ పార్టీలో ఎలాంటి మార్పు వచ్చిందో అంచనా వే యాలన్నారు. గతంలో ఎమ్మెల్యే హైదరాబాదులో ఉండ డం తప్ప ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదన్నారు. ప్రజలకు దూరంగా ఉండాలని సంస్కతి విడనాడి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసు ్తన్నమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజరుకుమార్, జడ్పీటీసీ కోట్ల మహిపాల్, మాజీ జడ్పీ టీసీలు మోహన్ రెడ్డి, పకీరప్ప, బీఆర్ఎస్ మండలా ధ్యక్షు లు ప్రమోదరావు, వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి రెడ్డి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మ న్ బీములు, కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరోత్తం రెడ్డి, ఎంపీటీసీ కేశవరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.