Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంటల సాగులో వచ్చే మార్పుల అంచనా వేసే యంత్రం
- తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రయోగం
- పంటల ఎదుగుదల, తెగుళ్ళు నష్టాలను తెలుసుకునే అవకాశం
- దక్షిణ భారతదేశంలోనే మొదటి సారీగా తాండూరులో ప్రయోగం
- సాంకేతిక పరికరాలతో రైతులకు జరుగనున్న మేలు
నవతెలంగాణ-తాండూరు
వ్యవసాయంలో మెలుకువలు, అధిక దిగుబడు లు సాధించేందుకు పంటల్లో ఎదుగుదల మార్పుల ను ఎప్పటికప్పుడూ అంచనా వేసేందుకు తాండూ రు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వినూత్న ప్ర యోగాలు చేస్తున్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కంది, కుసుమ, జోన్న, మొక్కజోన్న పంటల సాగు, పంటల్లో వచ్చే మార్పులను కనిపెట్టేందుకు దక్షణ భారతదేశంలోనే మొదటిసారిగా తాండూరు వ్యవ సాయ పరిశోధన కేంద్రానికి డ్రోన్ సాంకేతిక పరిక రాన్ని ప్రభుత్వం అందించింది. తెలంగాణ జిల్లాలో ని కంది, కుసుమ, జోన్న, మొక్కజోన్న పంటల సాగు, రైతులకు అధిక దిగుబడులు సాధించేందుకు అవసరమైనా సాంకేతిక పరికరాలను తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రానికి ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాల యం డ్రో న్ పరికరాన్ని అందించింది. ఈ డ్రోన్ పరికరంతో పంటల్లో మార్పులు అంచనా వేసేందుకు వీలుం టుంది. ఈ డ్రోన్ వ్యవసాయ పొలంలో విహరిస్తూ పంటల్లో వచ్చే మార్పులు, పంటలకు సోకే తెగుళ్ళు, పంట నష్టం అంచనా వేయగలుగుతుంది. వ్యవసా య పరిశోధనల కోసం వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్‌కు ప్రత్యేకంగా అమర్చిన సాంకేతిక పరికరాలు ప్రయోగాత్మకంగా అమరి ఉంటాయి. ఈ డ్రోన్‌కు అమరి ఉండే శక్తివంతమైనా కెమెరాలు 200 అడు గులపై నుండి ఛాయా చిత్రాలను స్పష్టంగా పోటో లు తీయగల్గుతుంది. ఈ డ్రోన్ పంటల ఎదుగుద లను వీడియో తీస్తుంది. దీంతో పంటల్లో జరిగే నష్టం అంచనా వేసేందుకు అవకాశముంది. భారీ విస్తీర్ణంలో సాగయ్యే వివిధ రకాల పంటల నష్టాలు, మదింపు చేసే అవకాశం డ్రోన్‌కు ఉంటుంది. వ్యవసాయంలో డ్రోన్ ఉపయోగించడం ద్వారా పంటల మార్పులను గమనించేందుకు వీలుం టుం ది. పంటలకు సోకే తెగుళ్ళు పంటల ఎదుగుదలను తెలుసుకేనేందుకు ఉపయోగప డుతోంది. పంటల సాగుల్లో ఈ డ్రోన్లను ఇదివరకే పశ్చాత్య దేశాల్లో ఉపయోగంలో ఉంది.
డ్రోన్ పంటల సాగు ఎదుగుదలను, తెగుళ్లు అంచనా వేస్తోంది
డ్రోన్ పంటల సాగులను, పంట నష్టాలను, పంటల్లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు తెలసు సుకునేందుకు ఈ డ్రోన్ ఉపయోగపడుతోంది. డ్రోన్ పొలంలో 200 అడుగుల ఎత్తు నుండి తిరు గుతూ పంటల్లో వచ్చే మార్పులను ఫొటోలు స్పష్టంగా తీయగల్గుతోంది. దీంతో పంటలకు సోకే తెగుళ్ళు తెలుసుకునేందుకు అవకాశముంది. ఈ డ్రోన్ వ్యవసాయంలో వచ్చే మార్పులు తదితర విషయాలు రైతులకు తెలిపేందుకు ఉపయోగప డుతోంది.
- వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త సుధాకర్