Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానికుల అప్రమత్తతో బాలికకు తప్పిన ప్రాణాపాయం
- మున్సిపల్ అధికారులపై స్థానికుల ఆగ్రహం
- మున్సిపల్లో కుక్కల బెడద నుంచి రక్షించాలని స్థానికుల వేడుకోలు
నవతెలంగాణ-తాండూరు
రాష్ట్రంలో చిన్నారులపై కుక్కలదాడులు రోజు రోజుకు అధికమవుతున్నాయి. చేసుకుం టున్నాయి. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట చిన్నారులు కుక్కల దాడితో గాయాలపాలు, ప్రాణా పాయాలు చోటు చేసుకుంటు న్నాయి. సోమవారం తాండూర్ మున్సిపల్ పరిధిలోని పాత తాండూరులో (4) బాలికపై కుక్క దాడి చేయడంతో బాలిక గాయాల పాలయింది. పాత తాండూర్‌కు చెందిన మరియా బేగం (4) పాత తాండూర్లోని కర్బలా మైదానంలోని అంగనావాడీలో చదువుకుంటుంది. ఉదయం అంగన్వాడీకి వచ్చి చూసేందుకు వచ్చిన బాలికపై కుక్క దాడి చేసింది. బాలిక అరుపులు కేకలు వేయడంతో దీనిని గమనించిన స్థానికులు అప్రమత్తమై కుక్కను అదిరించి బాలికను ప్రాణపాయాల స్థితిని కాపాడారు. బాలికకు వెనుక నుండి కుక్క దాడి చేయడంతో పంటి ఘాట్లు వీపుపై పడ్డాయి. తల్లిదండ్రులు స్థానికులు బాలికను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స చేయించారు. రోజురోజుకూ రాష్ట్రంలో కుక్కల దాడి పిల్లలపై జరుగుతున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం దారుణమన్నారు. తాండూర్ మున్సిపల్లో కుక్కల బెడద ఉందని పలు మార్లు మున్సిపల్ అధికారులకు తెలిపినా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం లేదన్నారు. మున్సిపల్లో కుక్కల బెడద నుండి ప్రజలను చిన్నారులను రక్షించాలని వేడుకుంటున్నారు. అధికారులు సకాలంలో స్పందించకపోతే ధర్నా సిద్ధమవుతున్నట్లు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.