Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తైక్వాండో రాష్ట్ర ఉపాధ్యక్షులు హెచ్.మనోహర్
నవతెలంగాణ-కొడంగల్
కొడంగల్ మున్సిపాలిటీ కేంద్రంలోని జూనియర్ కాలేజ్ మైదానంలో తైక్వాండో కరాటే పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరికీ టైక్వాండో కరాటే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాస్టర్ హెచ్.మనోహర్ టైక్వాండో కరాటే వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు జి. సురేష్ కుమార్ టైక్వాండో కరాటే విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. అనంతరం టైక్వాండో కరాటే రాష్ట్ర ఉపాధ్యక్షు డు హెచ్.మనోహర్ మాట్లాడుతూ టైక్వాండో అనేది ఒక యుద్ధ కళా అని నేటి కాలంలో యువకులు, యువతులు శారీరక దృఢత్వంతో పాటు మాన సిక దృఢత్వం పెంపొందించుటకు ఎంతో దోహదం ఏర్పడుతుందని తెలిపా రు. పిల్లలకు చిన్నప్పటినుండి విద్యతో పాటు పలు రకాల యుద్ధ కళలు యో గ తదితర వాటిపై శిక్షణ ఇప్పించాలని చిన్నప్పటినుండే పిల్లలకు మానసిక ఒత్తిళ్లకు లోను కాకుండా తోడ్పాటు అందించాలని పిల్లల తల్లిదండ్రులకు తెలి పారు. కొడంగల్ నియోజకవర్గంలో పలు మండలాల్లో గ్రామాల్లో జిల్లా ఉపాధ్యక్షుడు టైక్వాండో కరాటే మాస్టర్ జి.సురేష్ కుమార్ యువతీ యువ కులకు చిన్న పిల్లలకు ఫ్రీ కోచింగ్ రోజు ఉదయం స్థానిక గర్ల్స్ పాఠశాలలో టైకాండ్ కరాటే నేర్పిస్తున్నారని సమాజ సేవలో తన వంతు కృషి చేస్తు న్నారని కొనియాడారు. టైక్వాండో కరాటే సాధనలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని టైక్వాండో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదం డ్రుల సాక్షిగా జి.సురేష్ కుమార్ను అభినందించారు. కార్యక్రమంలో పలువు రు టైక్వాండో విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.