Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో మహిళ వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళ కో-కన్వీనర్ నాగలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. వరంగల్‌లో జరిగిన ఘటన మరవక ముందే అబ్దుల్లాపుర్ మేట్ మండలం అనాజ్‌పూర్‌లో మహిళను చంపేశారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలకు ప్రత్యేక చట్టం తీసుకురావలన్నారు. సావిత్రి బాయి పులే, కిరణ్ బేడి, హెలెన్ కేలార్ వంటి ఆదర్శ మూర్తులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెముల కుసుమ, జిల్లా అధ్యక్షుడు అశాన్నగారి భుజంగారెడ్డి, జిల్లా ప్రదన కార్యదర్శి జేర్కోని రాజు, జిల్లా కోశాదికారి దేవరంపల్లి రాజశేఖర్ గౌడ్, జిల్లా మహిళ విభాగం ఉపాధ్యక్షులు తాళ్ల నిర్మల, గణేష్, అంటి మహేష్, విరేష్, బుస్సు పాండురంగారెడ్డి, దివిటీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.