Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనా లకు కార్యచరణ ప్రణాళిక రూపొందించినట్టు ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరె డ్డి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరె న్స్ అనంతరం ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు... ప్రతి పది గ్రామాలకు ఒకటి చొప్పున క్రియాశీల కార్యకర్తలతో నిర్వహించే ఈ సమ్మేళనాలలో పార్టీకి చెందిన వార్డు సభ్యుడు మొదలుకొని ప్రజాప్రతిని ధులందరూ విధిగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఆత్మీ య సమ్మేళనాలు భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు మంగళవారం జిల్లా కోర్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నామని, మంత్రి సబితా రెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా చైర్మన్లు పాల్గొంటారని చెప్పారు. ఏప్రిల్ 20 లోగా సమ్మేళనాలు పూర్తి చేసి ఏప్రిల్ 25న విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు నియోజకవర్గాల స్థాయి లో నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థి యువజన తదితర అనుబంధ సంఘా లను బలోపేతం చేసే దిశగా ప్రత్యేకంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నుండి రూ.1200 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని అన్నారు. మార్చి నెలఖరులోగా రూ.1300 కోట్ల బిల్లులను స్థానిక సంస్థలకు చెల్లించే విధంగా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టినట్లు వివరించారు. సెర్ఫ్ ఉద్యోగులకు స్కేల్‌తో కూడిన ఉద్యోగ భద్రత కల్పించ డం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, తదితరులు ఉన్నారు.