Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేవెళ్ల
చేవెళ్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ దుకాణ సముదాయాలకు సంబంధించి టెండర్లను వేశారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ దుకాణాలకు గ్రామ పంచాయతీ కార్యాల యంలో సర్పంచ్ బండారు శైలజ ఆగిరెడ్డి ఆధ్వర్యంలో వేలం పాట ప్రక్రియ సాగింది. మొత్తం 63 దుకాణాలకు జరిగిన టెండర్లలో ఈ రోజు 31 దుకాణాలకు వేలం పాట జరిగింది. ఇందులో ఒక్కొక్క దుకాణానికి అడ్వాన్స్‌గా రూ.50 వేలు టెండర్లలో పాల్గొనే వారి నుంచి అధికారులు తీసుకున్నారు. గతంలో ఉన్న వారే ఎక్కువ మంది ఓపెన్ టెండర్లలో దక్కించుకున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి మాట్లాడుతూ దుకాణాలు దక్కించుకున్న వారు తప్పని సరిగా ప్రతి నెలా అద్దె చెల్లించాలన్నారు. మార్కెట్ రైతు బజార్ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి విఠలేశ్వర్ జీ, పంచాయతీ కార్యదర్శి వెంటకటరెడ్డి, ఉపసర్పంచ్ గంగి యాదయ్య, వార్డు సభ్యులు మల్లారెడ్డి, నాయకులు అగిరెడ్డి, రవిందర్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు నారాయణ, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.