Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీడీపీఓ శాంతిశ్రీ, సర్పంచ్ పి.అండాలు వెంకటేష్
- కాగజ్ఘాట్లో పోషణ పక్షం కార్యక్రమం
నవతెలంగాణ-మంచాల
చిరుధాన్యాల్లో పోషకాలు అధికంగా ఉంటాయని సీడీపీఓ శాంతిశ్రీ, సర్పంచ్ పి.అండాలు వెంకటేష్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కాగజ్ ఘాట్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పాల్గొన్న ఆమె మాటా ్లడుతూ ఈ ఏడాది పోషణ అభియాన్లో చిరు ధాన్యాలపై గురించి ప్రాధన్యతపోషణ అభియాన్లో భాగంగా చిరు ధాన్యాల ప్రాధాన్యత గురించి తెలియ జేసినట్టు తెలిపారు. తృణధాన్యాలు శరీరానికి కావాల్సిన పొటాషియం, జింగ్, కాల్షియం, ఇనుము, చిరు ధాన్యాల్లో విరివిగా ఉంటాయ న్నారు. వాటిని తీసుకోవడం వల్ల అధిక బరువు, షుగర్ స్థాయిలు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు జంగయ్య, శ్రీలత, అంజయ్య, వార్డు సభ్యులు జగదీష్ తదితరులు ఉన్నారు.