Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ అజయ్ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగం నాయక్
నవతెలంగాణ-కొత్తూరు
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఇముల్ నర్వ సర్పంచ్ అజయ్నాయక్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగం నాయక్ అన్నారు. మండలంలోని ఇముల్నర్వ గ్రామంలో మంగళవారం వెంకటేశ్వర హై స్కూల్ విద్యార్థులు రహదారి భద్రత, మైనర్ డ్రైవింగ్, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు వివరిస్తూ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడుపరాదన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో పాఠశాల కరస్పాండెంట్ బి. వేమారెడ్డి, ఉపసర్పంచ్ శ్రీరాములు యాదవ్, షాదన్గర్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, అధ్యాపక బృందం శ్రీరామ్, భీమయ్య, రాజేందర్ పాల్గొన్నారు.