Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి
- ఏఎంసీ ఆధ్వర్యంలో పోలేపల్లిలో పశు వైద్య శిబిరం
నవతెలంగాణ-ఆమనగల్
వివిధ సందర్భాల్లో నిర్వహించే పశు వైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకుని, లబ్ది పొందాలని ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని పోలేపల్లి గ్రామంలో మంగళవారం ఆమనగల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పశు వైద్య శిబిరాన్ని స్థానిక నాయకులతో కలిసి మార్కెట్ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి ప్రారం భించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆమనగల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశు వైద్య శిబిరాల ద్వారా పశువైద్య అధికారులు సూచించే పశు పోషణ మెలుకువలను తెలుసుకుని రైతులు లబ్ది పొందాలని సూచించారు. ఈసందర్భంగా పునరుత్పత్తితో పాటు వివిధ రకాల వ్యాధుల భారీన పడిన 52 పశువులకు వైద్య పరీక్షలు చేసి వాటికి కావాల్సిన మందులు అందించినట్టు మండల పశువైద్య అధికారి డాక్టర్ విజరు కుమార్ తెలిపారు. అదే విధంగా లేగ దూడలకు నట్టల నివారణా మందులు వేసి నట్టు వెల్లడించారు. ఈకార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు నేనావత్ అనురాధ పత్య నాయక్, సర్పంచ్ బాల్రాం, పీఏసీఎస్ వైస్ చైర్మెన్ దోనాదుల సత్యం, ఎంపీటీసీ సభ్యులు దోనాదుల కుమార్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు నర్సిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ రమేష్ నాయక్, మార్కెట్ కమిటీ కార్యదర్శి సరోజ, సూపర్వైజర్ శ్రీశైలం, మార్కెట్ కార్యాలయం సిబ్బంది వినోద్, కిరణ్, గోర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.