Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమానికి తరిలిరావాలి
- పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతున్న బీజేపీ ప్రభుత్వం
- మహేశ్వరం మండల కేంద్రానికి చేరుకున్న జీపు జాత
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బాక రామచందర్, ఎన్. రాజు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అలువాల రవికుమార్ అన్నారు. మంగళవారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) చేపట్టిన జీపు జాత మంగళవారం మహేశ్వరం మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ, కార్మికులను రైతులను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. అంతేకాకుండా ఇష్టాను సారంగా నిత్యావసర ధరలు పెంచుతూ, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతలం అమలు చేయడంలో నిర్లక్ష్యమెందుకని నిలదీశారు. పెంచిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు, పెన్షన్ రూ.10 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ స్కీమ్‌ను వెంటనే రద్దు చేసి, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలన్నారు. 60 ఏండ్లకు పైబడిన రైతులందరికీ పింఛన్ సదుపాయం కల్పించాలని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా, పెట్టుబడు దారులకు వత్తాసు పలుకుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంలో కార్మికులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బి.శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా నాయకులు ఏర్పుల శేఖర్, గుమ్మడి కురుమయ్య, స్కీం వర్కర్లు శైలజా, జ్యోతి, చంద్రకళ, జి.పి. సిబ్బంది బుజ్జమ్మ, చంద్రకళ, పెయింటర్ యూనియన్ తుక్కుగూడ అధ్యక్షులు పరమేష్, యాదయ్య, రాజు పాల్గొన్నారు.